పవన్ కల్యాణ్ ని శ్రీకృష్ణుడిగా అభివర్ణించిన యాంకర్ శ్యామల !

  • పవన్ కు మద్దతు తెలిపిన శ్యామల
  • శిఖండిని అడ్డుపెట్టడానికి భీష్ముడు కాదు
  • యుద్ధం చేస్తోందీ సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అంటూ ఓ పోస్ట్
తన తల్లికి న్యాయం చేసే వరకు తాను ఫిలిం ఛాంబర్‌ వదిలి వెళ్లేది లేదంటూ ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ఫిలిం ఛాంబర్ లో న్యాయవాదులతో ఆయన సమావేశమవడం విదితమే. ఈ నేపథ్యంలో పవన్ కు మద్దతు తెలుపుతూ పలువురు ప్రముఖులు పోస్ట్ లు చేశారు. తాజాగా, టీవీ యాంకర్ శ్యామల కూడా ఆ జాబితాలో చేరింది. ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. ‘శిఖండిని అడ్డుపెట్టడానికి భీష్ముడు కాదు...!!పద్మవ్యూహం పన్నడానికి అభిమన్యుడు కాదు ...!! యుద్ధం చేస్తుంది సాక్షాత్ "శ్రీకృష్ణుడే" జాగ్రత్త....!!!’ అంటూ పవన్ కల్యాణ్ ని శ్రీకృష్ణుడిగా అభివర్ణించింది. 
Go Back to Shorts
Pawan Kalyan
anchor shyamala

More Telugu News